Wednesday, September 27, 2023

On European Realism - Anantu Chintapalli

 On European Realism - Anantu Chintapalli

 

ఉదాహరణకి మీ కథా ఇతివృత్తంకుక్కఅయితే అందులో వాస్తవికత ఎంత? వాస్తవికేతరత ఎంత? బేరీజు వెయ్యడానికి క్రింది ప్రశ్నలను గమనించండి.

 

1.   మీరెప్పుడైనా కుక్కని చూశారా?

చూస్తే గనక అది దృగ్విషయం (Phenomenal), స్వానుభవం (Empirical).

 

2.   మీకు కుక్క తెలుసా?

తెలిసిఉంటే అది కుక్క పట్ల ఎరుక (Epistemological).

 

3.   మీకు కుక్కల్లో ఉండే రకాలు వాటి జాతులు తెలుసా?

తెలిసి ఉంటే అది కుక్కల వర్గీకరణ (Ontological)

 

4.   కుక్క కరుస్తుందని మీకు తెలుసా? కరిస్తే ఏం చెయ్యాలో మీకు తెలుసా?

తెలిసి ఉంటే మీరొక శాస్త్రీయ ప్రతినిధి (Professional).

 

5.   మీకు కుక్కలంటే ఏవేవో భయాలు, చీదర, ఎలర్జీలు ఉన్నాయా?

ఉంటేగనక మీ రచనలో మనోవైఙ్ఞానికశాస్త్ర (Psychological) ప్రమేయం అవసరం కావచ్చు.

 

6.   కుక్కల మూలంగా పర్యావరణంపై దుష్ఫలితాలు ఉండవచ్చని అనుకుంటున్నారా?

అయితే పర్యావరణ చైతన్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

 

మీకు పై అంశాల పట్ల పరిపూర్ణమైన అవగాహన, అంగీకారం ఉన్నట్లయితే మీరు కుక్క రచనకు పూనుకోవచ్చు. లేదా మీ కుక్క రచన వాస్తవికతకు దూరంగా ఉండిపోయే ప్రమాదం ఉంది.

 

7.   అమూర్తత అనేది, నిర్దిష్టత

 

అమూర్తత అనేది, నిర్దిష్టత వాస్తవికవాదానికీ, వాస్తవికేతరవాదాలకూ మధ్యేమార్గంగా అమూర్తత (Abstraction)ను గుర్తించడం జరుగుతోంది. అమూర్తత అనేది, నిర్దిష్టత (Concrete)కు వ్యతిరేకం.

 

 

 

8.   కుక్క ఉదాహరణతోనే అమూర్తతను అర్థం చేసుకోవడం.

 

ఒక పిల్లవాడిని కుక్క బొమ్మను గీయమని అడగండి. అతడు వెంటనే ఒక బొమ్మని గీస్తాడు. దానికి తల, కళ్లు, చెవులు, శరీరం, తోక, కాళ్లూ అన్నీ ఉంటాయి. కానీ అది అతడి కుక్క. అటువంటి కుక్క ఎక్కడా ఉండబోదు. ఎందుకంటే జాతికీ చెందినది కాదు; దానికి నిర్దిష్టతలేదు. అందుకే అది ఫలానా కుక్క కాదు. అది పిల్లవాడి ఊహ మాత్రమే.

 

భారతదేశంలో కనిపించే వీధి కుక్కల జాతుల వివరాలు నమోదు చెయ్యబడ్డాయా?  వివరాల పట్ల మనకు వున్న నిర్లక్ష్యం ఏమో?

 

9.    కుక్క మీ గురించి ఏమనుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?

 

10.               మీరే ఒక కుక్క అయితే

చివరిగా, మీరే గనక ఒక కుక్క అయితే పరిసరాల గురించి ఎలా ఆలోచిస్తారు.

ఇవేవీ తెలియకుండా, తెలుసుకోకుండా మీరు కుక్క కథ రాసేస్తే అది నిర్దిష్టమైన కుక్క కాజాలదు. అది మీ ఊహ మాత్రమే. అది వాస్తవికత అవుతుందా?

 

ఇప్పుడు కుక్క అనే పదానికి బదులు, స్వర్గం అనే మాట వాడదాం. స్వర్గం ఉంటుందనీ, ఫలానా విధంగా ఉంటుందనీ చాలా మంది నమ్ముతారుగానీ చూసినవారులేరు. (కుక్కనైతే కనీసం అందరం చూశాం). పోనీ కుక్కకి బదులు కాటికాపరి అనే పదం వాడామే అనుకోండి. ఎవరీ కాటికాపరి? అతనికీ నిర్దిష్టత లేదు...అలాగే హిజ్రా, సమాధులకోసం గోతులు త్రవ్వేవాడు, బిచ్చగాడు...ఎవరు వీరంతా?? మీ ఊహలలో, నిర్దిష్టతలకు ఎడంగా, అమూర్తంగా ఉండిపోయే వీరితో కథ వ్రాస్తే అది వాస్తవికత అవుతుందా?

 

సామ్యవాద వాస్తవికత – నాలుగు సూత్రాలు

 

వాస్తవికేతర గందరగోళం నుండి దూరంగా తొలగేందుకై సోవియట్ కమ్యూనిస్టు పార్టీ, మాక్సిం గోర్కీని సామ్యవాద వాస్తవికతపై ఒక సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించమని అడిగినప్పుడు అతడు బృహత్ కార్యానికి తాను తగనని చెప్పి సున్నితంగా తిరస్కరించాడు. అయితే సోషలిస్టు రియలిజంకు మూల స్తంభాలుగా నిలిచే నాలుగు సూత్రాలను ప్రతిపాదించాడు:

 

 

1.     రచనైనా, కళారూపమైనా కార్మికవర్గానికి (ప్రోలెటేరియట్) దన్నుగానే నిలబడాలి.

 

2.     కళారంగ ఉత్పత్తులు అట్టడుగు వర్గాల జీవితాలను ప్రతిబింబిస్తూ, అనుభవాలను నమోదుచేస్తూ, వారికి అర్థం అయ్యేటట్టుగా ఉండాలి.

 

3.     రచయితలూ, కళాకారులూ ఎంచుకొనే ఇతివృత్తాలు సామాజిక మార్పులను ప్రతిబింబించాలి.

 

4.     కళారంగ లక్ష్యాలు కార్మిక రాజ్యపు లక్ష్యాల పరిధిలోనే ఉండాలి.

 

తెలుగు సాహిత్యానికి వస్తే, కొద్ది మినహాయింపులలో - (ఉదా. శ్రీశ్రీ ప్రయోగాలు కొన్ని, బుచ్చిబాబు, త్రిపుర) మన రచనల్లో సుమారు 90 శాతం వాస్తవికవాద రచనలే. పరిణామాన్ని ఆధునికత వైపుగా సమాజం చేస్తూన్న ప్రయాణంగానూ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చెలరేగిన ప్రజాపోరాటాల, రాజకీయ సాహిత్యోద్యమాల ఫలితం అని భావించవచ్చు.

 

వాస్తవికవాదం చేసిన చెరుపు

 

ప్రపంచవ్యాప్తంగానూ, అలాగే మన సాహిత్యానికీ ఎంతో మంచిని చేసిన వాస్తవికవాదం, కొంత చెరుపుని కూడా చేసింది. మన పౌరాణిక, జానపద, గ్రామీణ మూలాల్లోని వాస్తవికేతర ధోరణులను విస్మరించి వాటినే చుట్టూ తిరిగి పాశ్చాత్య, లాటిన్ అమెరికన్ రచనల ద్వారా కొత్తగా తెలుసుకుంటున్నాం, గుర్తిస్తున్నాం (ఉదా : మేజికల్ రియలిజం). వాస్తవికవాదాన్ని కళారంగాలకు అన్వయించడం అంటే కొన్ని పార్టీల రాజకీయ అజెండాకు లోబడి ఉండాలనుకొనే సంకుచిత్వాన్నీ, ప్రమాదాన్నీ ఎదుర్కొంటున్నాం. ఏది ఏమైనప్పటికీ ధోరణులపై మరింత విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

సోషలిస్టు వాస్తవికతకే బాలగోపాల్

 

సోషలిస్టు వాస్తవికత' అనే తొలినాటి సోవియట్ సాహిత్య సిద్ధాంతం, రోజు పెద్దగా ప్రచారంలో లేదు గానీ అది అలవరచిన వైఖరి తెలుగులో అభ్యుదయ సాహిత్యాన్నేకాక మొత్తంగా తెలుగు కథా సాహిత్యాన్ని (కొద్ది మినహాయింపులతో) ఇంకా వదిలి పెట్టినట్టు లేదు. తెలుగులో కథా సాహిత్య శిల్పం మొత్తం మీద ఇంకా 'రియలిజం' పరిధులు దాటిపోలేదు. నిజ జీవితంలో లాగ తెలుగు కథా సాహిత్యంలో కూడ కాలం ఎప్పుడూ గతం నుండి భవిష్యత్తు వైపే ప్రవహిస్తుంది. కార్యకారణ సంబంధాలు కర్త కర్మ క్రియలలాగ ఉండవలసిన చోటే ఉంటాయి. చైతన్యాన్ని ఎప్పుడూ పదార్థమే నిర్ణయిస్తుంది. 'శాస్త్రీయ దృక్పథం' పాటించాలన్న నియమం లేని పిల్లల సాహిత్యానికి మాత్రమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్నీ హేతువాద తర్కాన్నీ తిరస్కరించే లైసెన్స్ ఇవ్వబడింది.”

 

(బుర్ర రాములు రాసిన 'ఏడో సారా కథ'కు  బాలగోపాల్ ముందుమాట, పర్స్పెక్టివ్ ప్రచురణ, జులై 1995)

No comments:

Post a Comment