ఒక అన్వేషి, కొన్ని ఆలోచనలు
09-01-2017 02:43:13
https://www.andhrajyothy.com/artical?SID=355329
ఒక భుజమ్మీద కథనీ కవిత్వాన్నీ, రెండో భుజమ్మీద విమర్శనీ సంపాదకత్వాన్నీ మోస్తూ తెలుగు నేల నాలుగు చెరగుల్నీ దుక్కి దున్ని సాహిత్య వ్యవసాయం చేస్తున్న సతతహరిత స్వాప్నికుడు పాపినేని శివశంకర్. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యాన్ని తన బహుళ తాత్విక దృక్పథంతో తేజస్వంతం చేస్తున్న శివశంకర్ ఇప్పటి వరకు ‘స్తబ్ధత చలనం’, ‘ఒక సారాంశం కోసం’, ‘ఆకు పచ్చని లోకంలో’, ‘ఒక ఖడ్గం ఒక పుష్పం’, ‘రజనీగంధ’ అనే ఐదు కవితాసంపుటులు; ‘మట్టిగుండె’, ‘సగం తెరిచిన తలుపు’ అనే రెండు కథాసంపుటులు; ‘సాహిత్యం-మౌలిక భావనలు’, ‘నిశాంత’, ‘ద్రవాధునికత’ అనే మూడు విమర్శ గ్రంథాలు; ‘తల్లీ! నిన్ను దలంచి’ అనే ప్రాచీన కవిత్వ వ్యాఖ్యానం వెలువరించారు. శివశంకర్ ‘రజనీగంధ’ కవితా సంపుటికి 2016 కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించిన సందర్భంలో ఆయనతో కొప్పర్తి జరిపిన సంభాషణ ఇది:
ఇంతకీ ‘రజనీగంధ’అంటే ఏమిటి?
రజని అంటే రాత్రి కదా? రాత్రిపూట సువాసనలీనే పువ్వు రజనీగంధ. దాన్ని రూపకంగా (Metaphor)) గ్రహించటం అది. మనుషులు అస్పష్టమవుతున్న, అస్వచ్ఛమవుతున్న, సమాజం నలుపుకు మారుతున్న సందర్భం ఇది. ఈ పగటి రాత్రివేళ వీచే స్వచ్ఛ సుగంధ పవనమే రజనీగంధ అనుకోవచ్చు.
‘స్తబ్ధత - చలనం’తో ప్రారంభమై ‘రజనీగంధ’ దాక సాగిన శివశంకర్ కవిత్వ ప్రయాణ అంతస్సూత్రం?
ఆ కవిలోని, కవి చుట్టూ సమాజం లోని స్తబ్ధతను బద్దలుగొట్టే ప్రయత్నమే ‘స్తబ్ధత - చలనం’. ‘‘శివశంకర్! శివశంకర్! ఎన్నడూ మరణించకు, ఈ పగటి చీకటిరాత్రి అమృతం కోసం నీ అన్వేషణ మానకు’’ అంటూ ‘ఒక సారాంశం కోసం’ సాగిన దశ రెండవది. ‘ఆకుపచ్చని లోకంలో’ జరిగే ప్రాకృతిక మానవ విధ్వంస తిరస్కరణ మూడవ దశ. అమానవీయతపై ఆగ్రహ ప్రకటన, మానవీయ విలువలపై ప్రేమ ‘ఒక ఖడ్గం ఒక పుష్పం’. పరిపక్వ దశ ‘రజనీగంధ’.
‘రజనీగంధ’ ఏకకేంద్ర కవిత్వరచనగా అన్పించదు. అందులోని వైవిధ్యమే దానికి కారణమా?
రజనీగంధ వైయక్తిక సామాజిక కవిత. అది ఏకధార గాదు. అందులో తన అనుభూతుల్ని అనుభవాల్ని క్షాళన చేసుకుంటూ ప్రకృతితో, సమస్త ప్రాణిలోకంతో మైత్రి నెరపే ప్రాకృతిక, నిసర్గ మానవుడు మీకు కనపడతాడు. ఈ సంపుటిలో ఆధారం కన్న ఆధేయం ప్రధానం. అంటే వస్తువు కన్న ఆ పునాది మీద చేసిన దర్శనమే ప్రధానం. ‘చెప్పులు మీద’, ‘కాసేపు ఎలుకల గురించి’ రాసినప్పుడు అవి ముఖ్యం కాదు. దర్శనానంతరం ఆ వస్తువు అదృశ్యమై కవిలో, కవితాప్రేమికుడిలో అంతిమంగా ఒక జీవన సౌరభం మిగులుతుంది. అది సాధారణ కవిత్వ ప్రమాణాల్లో ఒదగకపోవచ్చు.
జీవితాన్ని ఉన్నతీకరించటమే కవిత్వం చేసే పని అన్న శివశంకర్ ‘జీవితం అద్భుతపుష్పం వికసించే ప్రక్రియ’ అనగలగటం ఆ ప్రాసెస్ ఫలితమేనా?
అవును, కచ్చితంగా. జీవితాన్ని ఉన్నతీకరించటమంటే దాని సారాంశాన్ని గుర్తించి, గ్రహించి, ఆవిష్కరించటం. ధనదాహాలు, అహంభావాలు, అసూయలు, ముసుగులు, కపటాలు, డొల్లతనాలు, నిర్జీవవాక్యాలు - వికసిస్తున్నామని అనుకొంటూ వాడిపోతున్న బతుకులివి. ఒకే ఒక్కసారి వికసించే అద్భుత పుష్పంగా జీవితాన్ని చూడగలిగితే ఆ సౌరభాన్ని కలకాలం ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా వెదజల్లాలో అర్థమవుతుంది.
శివశంకర్ వైయక్తిక అనుభవాల్నీ, తనకిష్టమైన వ్యక్తుల్నీ కవిత్వీకరించినప్పుడు పతాకస్థాయి చేరుకు న్నట్టు అనిపిస్తుంది?
ఏ కవికైనా బాహ్య, లేదా సామాజిక విషయాల వ్యక్తీకరణలోకన్నా స్వీయానుభవ వ్యక్తీకరణలోనే ఆత్మీయత ఉంటుంది. గాఢత ఉంటుంది. బాహ్య విషయాల్ని బాగా ఆత్మీకరించుకోగలిగినప్పుడూ ఆ గాఢత ఉంటుంది. కొన్నిటిని కేవలం బాహ్యంగానే ఎదుర్కొంటే కవి పల్చనై తేలిపోతాడు. అత్యున్నతస్థాయిలో కవి తలపడే వస్తువులో వైయక్తిక, సామాజికాల సరిహద్దురేఖ తొలగిపోతుంది. ఉదాహరణకి ‘పెంపకం’ కవిత కవి యొక్క పిల్లల పెంపకంతో ముగిసి చదువరుల పెంపకంలోకి తీసుకు వెళ్తుంది. That is subjective and objective as well. ఆంతరంగికం చేసుకోని ఏ బాహ్య విషయాన్నీ శివశంకర్ ముట్టుకోలేదు. వైయక్తిక అనుభవాల్ని కవిత్వీ కరించినప్పుడు- He reaches the highest point of expression. ‘స్త్రీలు భూదేవతలు, సూర్యచంద్రులు రెండు స్తనాలైనవాళ్లు’ అనటం అటువంటి ఒక పతాకస్థాయే.
వైరుధ్యాలుగా కన్పించే అంశాలను కూడా నిస్సంకో చంగా, నిర్భయంగా వ్యక్తీకరించగలగటానికి (ఎం.ఎఫ్. హుస్సేన్ నగ్నచిత్రాలను విమర్శించటం, ఒక ప్రజానాయకుడి అకాల మరణాన్ని సకాలం అనటం, దేశీయత లేని క్రికెట్ వ్యామోహాన్ని ఖండించటం, వివేకానందుడిని ప్రశంసించటం మొ.) - Can we say that he has liberated himself from typical attitudes
Certainly. సర్వజనామోదం పొందే విషయాలను గూర్చి రాయటం సుకరంగా ఉంటుంది. అవసరమైనప్పుడు కవి వాటి నుంచి, ఆ విధంగా తన సంకెళ్ల నుంచి తాను విముక్తుడు కావాలి. ఎవరో నిన్ను అభ్యుదయవాది అనుకోరని ఎం.ఎఫ్. హుస్సేన్ అరాజక ‘స్‌వేచ్‌ఛ!’ని ఖండించకపోతే ఎట్లా? సంప్రదాయవాది అనుకొంటారని ‘వివేకవాక్యం’ రాయకపోతే ఎట్లా?
అస్తిత్వ ధోరణులకు భిన్నంగా కవిత్వం రాయగలగ టానికి కవి ఆయా వర్గాలకి సంబంధించిన వ్యక్తి కాకపోవటం కారణమా?
ఏ వాదమైనా ఒక విషయాన్ని ప్రత్యేకంగా పైకెత్తు తుంది. అదే సమయంలో ఒక పరిమితికి కూడా లోనవు తుంది. పూర్వం పట్టించుకోని విషయాల పట్ల ఒక ఎరుక, చైతన్యం కల్గించాయి అస్తిత్వవాదాలు. అదే క్రమంలో అవి మన దృక్పథాన్ని విశాలం చేశాయా? మనమెందుకు ఇరుకయ్యాం? ఆలోచించాలి. అస్తిత్వవాదాల పట్ల సానుభూతితో కొన్ని కవితలు రాసినా, అపరిమిత మానవాస్తిత్వమే శివశంకర్‌కి విషయం.
ఆధునిక కవి నిరంతరం కొత్త పరిభాష రూపొందిం చుకోవాలంటాడు శివశంకర్. అది ఎలా జరిగింది?
ప్రతి కొత్త వస్తువూ కొత్త అభివ్యక్తిని అపేక్షిస్తుంది. ‘రజనీగంధ’లో ఏ కవిత రూపురేఖలు దానివే. అరిగిపోయి న మాటలుండవు. కవి తనదైన వ్యక్తీకరణ, భాష, ఇమేజరీ సృష్టించుకొన్నప్పుడే కవితకి నూతనశక్తి. ‘రజనీగంధ’లో అటవీసముద్రాలు, సముద్రపుటెడారులు, తావుల తలపులు, రుధిరజల జ్వాలలు, వినీల గానమోహిత గగనాలు, వాంఛా కల్లోల రాత్రులు, చిట్లిన కలల గాజుబొమ్మలు మొదలైన పదకల్పనలు; అమెరికేండియా, బాక్టీరియోదకం, అవగుణసంధి లాంటి ప్రయోగాలు మీకు తగుల్తాయి. దురదృష్టం కొద్దీ మనకు వస్తువు మీద ఉన్న శ్రద్ధ రూపం మీద, అందులో శిల్పం మీద, భాషమీద లేదు.
అట్లా కొత్త పరిభాష రూపొందించుకోవటంలో ప్రాచీన పద్యకవిత్వ అధ్యయనం అతనికేమైనా తోడ్పడిందా?
నిస్సందేహంగా. ఆధునిక కవికి సామాజికత, సృజనా త్మకత మాత్రమే చాలవు. భాషాసంపద, వ్యక్తీకరణ వైవిధ్యం, శైలీ వైవిధ్యం చాలా అవసరం. పదాల మధ్య, పదబంధాల మధ్య, వాక్యాల మధ్య లయ సాధించాలి. ఆ లయ తెలిసినప్పుడే ‘సమరసమీరం వీచే ఎడారిసీమలు’ అనే సమరస ప్రయోగం చెయ్యగలం. భావ విశద క్రమం కూడా ఉండాలి. వీటన్నిటికి ప్రాచీన కవిత్వ అధ్యయనం ఎంతో దోహదం చేస్తుంది. నయాగరాని ‘కళ్లెం తెగిన కదన ధవళాశ్వం’ అనటానికి ఊహాశక్తి తోడైతే ‘గాయనీ ధుని, ధునీ గాయని’ అనటానికి ‘నాకధునీ శీకరముల చెమ్మ’ అనే పూర్వకవి ప్రయోగం సాయపడుతుంది. బాల వ్యాకరణంతో సహా వేల పద్యాలు శివశంకర్‌కి కంఠస్థం.
కథ, కవిత్వం, విమర్శ- ముప్పేటలుగా సృజన చేస్తున్న సాహితీ త్రిముఖుడిలో ఏ ముఖం ముఖ్యం?
అతడు ప్రాథమికంగా కవే. కవిత్వానికవసరమైన భావావేశాలు అతనిలో బలీయంగా ఉంటాయి. గుండెతడి, మానసికాగ్ని లేకుండా రాయలేనితనం. ‘ఒక అల, ఒక జ్వాల కలిస్తే నేను’ అంటుంది ఒక కవితావాక్యం. ఆ తర్వాత కథ చాలా ఇష్టం.
జీవితాన్ని సాహిత్యం, సాహిత్యాన్ని విమర్శ, విమర్శని తత్వం ఉన్నతీకరిస్తాయని నమ్మే పాపినేని విమర్శకు తాత్విక భూమిక ఏమిటి?
కథ, కవితల్లో ఒక ఆవిష్కరణ ((Discovery) ఉంటే విమర్శలో ఆవిష్కరణతో పాటు దాని కవసరమైన సాధనాల, భావనల ఆవిష్కరణ, నవీనకల్పన (Innovation) ఉంటాయి. రకరకాల సిద్ధాంతాల నుంచి, శాసా్త్రల నుంచి రూపొందించిన సాధనాలు, భావనలు ఉంటాయి. ‘సాహిత్యం-మౌలికభావన’ల్లో వస్తువు, రూపం మొదలైన కొన్ని భావనలు, సూత్రీకరణలకి మార్క్సిస్ట్ ఈస్తటిక్స్ అధారం. అవిచ్ఛిన్నత అనే భావనకి కొశాంబి చరిత్ర సూత్రీకరణ, నిసర్గతా భావనకి ఎరిక్ ఫ్రామ్ చెప్పిన స్పాంటేనిటీ ఆఫ్ లైఫ్, ద్రవాధునికతకి జిగ్మంట్ బౌమన్ ఆలోచనాధార ఆధారాలు. ఇక అస్పష్టత, సంక్లిష్టత, అశ్లీలత, పరాయితనం, స్తబ్ధత మొదలైన భావనల్ని తొలిసారిగా నిర్వచించి, సాహిత్యానికి అన్వయించటం ‘సాహిత్యం- మౌలికభావన’ల్లో మీరు చూడవచ్చు.
పాపినేనిది బహుళ తాత్విక దృక్పథం అంటున్నారు. అనేక తత్వాల కలగలుపులో వైరుధ్యం లేదా?
పాపినేని మీద ఉపనిషత్తుల శాంతత, బౌద్ధ మైత్రి, మార్క్సిజం సామాజిక స్వప్నం, అస్తిత్వవాద సారాంశ శోధన, ఎరిక్‌ఫ్రామ్ స్వేచ్ఛాదృష్టి- ఇటువంటి ప్రభావాలెన్నో ఉన్నాయి. ఒకప్పుడు వైరుధ్యాలనిపించేవి. ఇప్పుడవన్నీ ఒక సమగ్రతలో భాగాలనిపిస్తాయి.
ఎరిక్ ఫ్రామ్ అతనికి కల్గించిన ఎరుక ఏమిటి? ద్రవాధునికత ఏ తత్వ పర్యవసాయి?
ఆధునిక వస్తుప్రపంచంలో మానవీయవిలువల్ని ఎట్లా కాపాడుకోవాలో Fear of Freedom, Sane Societyలో చెప్పాడు ఎరిక్ ఫ్రామ్. స్వేచ్ఛ, శ్రమ, ప్రేమ మూలధాతువులుగా నిసర్గ జీవనం (Spontaneous life) ప్రతిపాదించాడు. ఆ ఎరుక, ధిక్కారం, స్వేచ్ఛా కథావ్యవస్థ మొదలైన ప్రతిపాదనలు ‘నిశాంత’లో ఉన్నాయి. ఇక జిగ్మంట్ బౌమన్ Liquid Modernity నుంచి ద్రవాధునికత భావన రూపొందింది. అతి వేగంగా మారుతున్న అభద్రత, అస్థిరత మూగిన ఇప్పటి సామాజిక వైయక్తిక జీవనాన్ని విశ్లేషించే సాధనం అది. తద్వారా ప్రపంచీకరణ పరిణామాలతో పాటు సాఫ్ట్‌వేర్ శకంలో Light Capitalism గురించి, వినియోగదారుల సమాజంలో వ్యక్తి విహ్వలత గురించి ఆలోచించగలం.
సంపాదకునిగా అతని అనుభవాలేమిటి? అవి అతని సృజనాత్మకతకు అడ్డు రాలేదా?
ఆయా రచనల్ని విలువగట్టటంలో అనుభూతి కన్న విమర్శనాదృష్టి తోడ్పడింది. అయితే సంపాదకత్వం అతని ప్రధానకృషి కాదు. ఒక రకంగా అది తలనెప్పి పని. తల బొప్పికట్టే పని కూడా. ఎంతో సమయం కూడా వెచ్చించాలి. కాకపోతే కొన్ని కొత్తగొంతుల్ని కనుగొన్నప్పుడు, మంచి రచనల్ని పైకెత్తినప్పుడు కొంత తృప్తి.
జాతీయస్థాయిలో గొప్ప గుర్తింపు లభించిన ఈ సందర్భంలో శివశంకర్ ఎవరినైనా గుర్తు చేసుకోవాల నుకుంటున్నాడా?
తొలి పాఠాలు నేర్పిన నన్నపనేని అంకినీడు, ఆటల్లో ఆసక్తి రేపిన వలేటి వెంకటేశ్వరరావు, లెక్కల్లో గట్టెక్కించిన పొదిలి సుబ్బారావు, మలి విద్యార్థిదశలో నాగళ్ల గురు ప్రసాదరావు, ఓరుగంటి నీలకంఠశాసి్త్ర, కవి జీవితనిష్ఠ నేర్పిన తెనుగులెంక తుమ్మల - ఎప్పటికీ ముఖ్యంగా వీరిని, మరెందరినో గుర్తు చేసుకుంటూనే ఉంటాడు.
అతని సాహిత్య ప్రయాణాన్ని పరిపుష్టం చేసిన మేధావులు, రచయితలు, పుస్తకాలు...
తొలి ముద్ర ‘Where the mind is without fear' అన్న టాగూర్‌ది. పూర్వకవుల్లో తిక్కన, పోతన, ఆధునికుల్లో శ్రీశ్రీ తర్వాత తిలక్. రచయితల్లో శ్రీపాద, కొడవటిగంటి, మాధవపెద్ది గోఖలే. ఇంకా శరత్, ప్రేమ్‌చంద్, గొగోల్, దొస్తొయెవ్‌స్కీ, నెరూడా, హెమింగ్వే, ఇలియట్ - ఇట్లా ఎందరో. విభూతి భూషణ్ ‘అరణ్యక’ (వనవాసి) చాలా చాలా ఇష్టం.
ఇంతకీ శివశంకర్ మౌలికంగా ఎవరు?
జీవితం అలౌకిక పదార్థం కాదుగాని, అది నిర్వచనాలకి, సూత్రీకరణలకి, సిద్ధాంతాలకి ఒకందాన లొంగదు. మారుతున్న సమాజాన్ని ప్రతిదశలోను కొత్తగా అర్థం చేసుకొంటూ పాత జ్ఞానం విస్తృతం చేసుకొంటూ కొత్త అన్వయాలకోసం ప్రయత్నించాలి. ఇప్పటికీ మనం చాలమట్టుకు పడికట్టు పదజాలంతో ఆడుతూ పరిమిత ప్రమాణాలతో ఉపరితల ప్రయాణమే చేస్తున్నాం. కవి ఇంకా విచ్చుకోవాలి, వెతుకులాడాలి, తను కనుగొనాల్సిం దేదో కనుగొనాలి. వస్తువు అనంతం. అన్వేషించాలి. వస్తురూపాల్లో ఇరుకు చట్రాలు బద్దలు గొట్టాలి. ఈ నెక్కల్లు పిల్లాడిని ఇప్పుడెవరైనా మళ్లీ ఉయ్యాల తొట్టిలో పడేసి, నీ పేరు నువ్వు పెట్టుకొమ్మంటే ఆ పేరు ‘అన్వేషి’.
అన్ని విలువలు పతనమవుతున్న వర్తమానంలో సాహిత్యరంగంలో కవిగా, వ్యక్తిగా ఈ అన్వేషి ఏ విలువల్ని నిల్పుకోవాలని, నిల్పాలని ఆశిస్తున్నాడు?
వ్యక్తిగా అతనిది సరళ జీవనరేఖ. ఈ క్షణం దాక ఎక్కడా వక్రమార్గం లేదు. వ్యసనపరత్వం లేదు. కవి వ్యక్తిత్వం, కవిత్వ వ్యక్తిత్వం వేర్వేరు కాదు. సాహిత్యం ఒకే సమయంలో సాధనం, గమ్యం కూడా. సాధనంగా అది చైతన్యాన్ని, గమ్యంగా ఆనందాన్ని కల్గిస్తుంది. సాహిత్య మంటే సభలు, సభానంతర పానగోష్ఠులు, పైపై మెరమెచ్చులు కాదు. దానికెంతో నిష్ఠ, సమర్పణ అవసరం. ఆ సాధనలోనే శివశంకర్ ఉన్నాడు. ఉంటాడు.
ఇంటర్వ్యూ: కొప్పర్తి వెంకటరమణ మూర్తి
98495 25765

No comments:
Post a Comment