సరికొత్త సైద్ధాంతిక భావనకు పుస్తకరూపం
సమాజమనే బంధం నుంచి కట్టుబాట్లను ఛేదించుకొని స్వార్థ సంకుచిత జీవితాన్నే పరమలక్ష్యంగా ఎగబాకుతున్న వారికి తాము పోతున్నది పైకి కాదు, కిందికి అని తెలిసినా, దానిని సరిదిద్దుకొనే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. కులవృత్తుల నుంచి కుటీర పరిశమ్రలకు, వాటి నుంచి పొగగొట్టాలకు, అక్కడ్నించి ఐటి పరిశ్రమలకు ఎగబాకిన మానవ ప్రగతిరథం చివరకు చేరుకున్నది ఎక్కడికో తెలిస్తే మనసు ఉసూరుమంటుంది. ఇంగ్లండు, అమెరికా సమాజాల పోకడలను అతిగుడ్డిగా అనుకరిస్తున్న భారత్ సహా అనేక ప్రపంచ దేశాల్లోని సమాజాల పరిస్థితి ఇవాళ మీద మిటమిట- లోన లొటలొట అన్నట్టుగానే ఉంది.
druvanikataప్రసిద్ధ సాహితీవేత్త డా॥ పాపినేని శివశంకర్ కలం నుంచి తాజాగా వెలువడిన విలువైన గ్రంథం ద్రవాధునికత చదివిన వారికి ఎవరికైనా సరిగ్గా ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. అత్యాధునిక పోకడల పుణ్యమా అని మనుషులు ద్రవ్యం (డబ్బు) మత్తుకు ఎంతగా బానిసలైనారో, ఆ మడుగు స్థాపనకు మూలధ్రువంలా ద్రవాధునికత అనే మాయాభావన ఎలా దోహదపడుతున్నదీ ఆయన ఇందులో చాలా లోతుగా చర్చించారు.
పోలండ్‌కు చెందిన ప్రఖ్యాత సామాజిక తత్వవేత్త జిగ్మంట్ బౌమన్ (85) సృష్టించిన సరికొత్త సైద్ధాంతిక భావనతో కూడిన పుస్తకం లిక్విడ్ మోడర్నిటీలోని ఆత్మను పాపినేని వారు ఎంతో ఒడుపుగా పట్టి, అంతే సరళంగా తెలుగు పాఠకులకు అందించారు. రెండేళ్లుగా చదువుతూ వచ్చిన బౌమన్ పుస్తక సారాన్ని మనవైన, స్థానిక పట్టువిడుపులతో మేళవించి, తనదైన సారాన్ని జోడించి ప్రస్తుత తెలుగు సమాజానికి సరిపోయేలా అక్షరబద్దం చేశారు. అసలు, ద్రవాధునికత అంటే ఏమిటి అంటే ఒక్క మాటలో ఉరకలేసే వర్తమానం అన్న బౌమన్ మాటను ఉదహరించారు. అంతేకాదు, ఆఖరకు అదొక గాడితప్పిన జీవన విధానం.
దానికి వారు పెట్టిన ముద్దుపేరు స్వేచ్ఛ అన్నారు. నిజమే, స్వేచ్ఛ ఇవాళ ఎంత విశృంఖల జీవనమైందో ఈ పుస్తకం చదివితే పూర్తిగా అర్థమవుతుంది. బౌమన్ వెలువరించిన భావాలే (మొదటి భాగం) ఒక ఎత్తు అనుకుంటే, పాపినేని వారు చేసిన విశ్లేషణాత్మక సూత్రీకరణలు (రెండో భాగం) మరో ఎత్తు అనాలి. అవసరమైనప్పుడు బౌమన్‌తో విభేదించినట్లు, మనదైన సమకాలీన సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడక్కడ ఒకింత పక్కకు కూడా జరిగినట్లు వారు ముందుమాట (సరికొత్త ఉరవడిలో..)లో చెప్పారు. సాహిత్యంలోని ఈ పదునైన పనిముట్టును సామాజిక చైతన్యవంతులు మున్ముందు ఇంకా వైనంగా చర్చించాలని కూడా వారు అభిలషించారు. ఇది చాలు, పాపినేని వారు పుస్తకాన్ని వీలైనంత వరకు ఎంత సమగ్రంగా, సముచితంగా రాశారో చెప్పడానికి.
అవును, రెక్కలొస్తే మనిషి ఎక్కడికైనా ఎగిరిపోయి, ఏదైనా చేస్తాడన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం దుర్వినియోగమవుతున్న స్వేచ్ఛ. పదిమంది సామరస్యత, సమగ్రతల కోసం ఏర్పరచుకొన్న నియమాలు, చట్టాలు, న్యాయాలు, ధర్మాలు అన్నీ అలాంటి వారికి అడ్డుపుల్లలుగానే కనబడుతుంటై. మూస అభివృద్ధి పరిణామ క్రమంలో మానవజాతి అమానవీయంగా తయారవుతున్న ఈ పరిస్థితుల్లో ఇటువంటి తాత్విక చర్చలు అనివార్యం, అత్యవసరం కూడా.
ఒక ద్రవ పదార్థంలా స్థిరంగా ఉండక నిరంతరం మార్పులు చెందుతున్న సామాజిక స్థితిగతులనే బౌమన్ ద్రవాధునికత భావనగా పిలిచారు. దీనిని భారరహిత పెట్టుబడి కాలం (పే: 24)గానూ ఆయన పేర్కొన్నారు. ప్రగతి గత కొన్నేళ్లుగా ఎంతగా వ్యక్తిగతమైందో, విధాన రహితమైందో వివరించారు. శ్రామిక శక్తి మృదువుగా మారింది. భౌతిక వస్తువులు కాక ఐడియాలు కూడా లాభాలకు కేంద్రబిందువులవుతున్నాయి. పెళ్లిని కాదని, సహజీవనానికి అలవాటు పడడం దగ్గర్నుంచీ అభివృద్ధి పేరుతో విధ్వంసమై పోతున్న విలువలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి. పుస్తకంలో మొత్తం 32 వ్యాసాలు ఉన్నాయి.
ద్రవాధునికం పేరున ఒక కవిత అందించారు. బౌమన్ జీవిత విశేషాలు, ఆయన రచనల వివరాలు పాఠకులకు ఉపయుక్తం. ఆధునిక జీవితం ఎటు తిరిగి ఏ గతి పట్టింది, ఘనాధునికత తర్వాత ద్రవాధునికత పుణ్యమా అని విస్తరించిన అపసవ్య ధోరణులు, వాటి నుండి బయటపడే మార్గాలనూ రచయిత చాలా విపులంగా చర్చించారు.
ద్రవాధునికత, రచన: డా॥ పాపినేని శివశంకర్, పేజీలు: 104, వెల: రూ. 70/- ప్రతులకు: నవచేతన బుక్ హౌస్ అన్ని పుస్తక కేంద్రాలు లేదా నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ (నాగోల్), జిఎస్‌ఐ (పోస్ట్), హైదరాబాద్-500068. ఫో॥ 040-24224458. రచయిత మొబైల్: 85008 84400.
దోర్బల