ఎవరో ముక్కూ ముఖం లేని అనామకుడు నా మీద ఏదో రాసినట్టు మిత్రులు చెప్పారు. ఆకాశరామన్న ఉత్తరాలు కరపత్రాలు రాసే సంస్కృతి విప్లవోద్యమంలోనూ వుండేది. దాన్ని ఇప్పుడు పునరుధ్ధరించినట్టున్నారు. పిచ్చివాళ్లు సహితం విప్లవోద్యమాల్లో చేరతారు కదా!. వీళ్లతో వచ్చిన సమస్య ఏమంటే వీళ్ళు అందరి తప్పులు వెతుకుతారు. వీళ్ళేమి చేస్తున్నారో చెప్పరు. పిచ్చివాళ్ల మీద యుధ్ధం చేయడం క్షాత్ర ధర్మం కాదు.
Sarath Chandra
రామారావు పేట లు,
ఆజాద్ బాగ్ లు ఉన్నాయి,
ఖాదర్ లు, ఖదీర్ లే లేరు..!!
~~
~~
పౌరసత్వ సవరణ చట్టం (CAA) కేవలం ముస్లీం పౌరులకు వ్యతిరేకమైన చట్టం అనే అపోహలోనే ఈ దేశంలోని 90 శాతం మంది జనం ఉన్నారు. కానీ అది పచ్చి ఫాసిస్ట్ చట్టం అని, అది మతం ప్రసక్తే లేకుండా దేశంలో ని మూడొంతుల జానాభా ఉనికిని తల్లకిందులు చేయబోతుందనే ఎరుక బుద్ధిజీవులు అని భావిస్తున్న వాళ్ళలోనే ఇంతవరకూ లేదు. CAA వ్యతిరేక ఆందోళనలు అన్నీ ముస్లీంలకో, కమ్యూనిస్టులకో సంభందించిన గోడవలుగా భావిస్తున్నారు. దాదాపు దేశ విభజన తర్వాత ముస్లీంలు ఇంతగా కదిలి మహిళలు, పిల్లలు అనే తేడాలేకుండా రోడ్లమీదకి వస్తున్న ఉద్యమం ఇది. షాహీన్ బాగ్ స్పూర్తితో దేశమంతా నిరసన శిబిరాలు వెలిశాయి. ప్రతీరోజూ లక్షల మంది మహిళలు రోడ్లమీదకి వస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని శిబిరాలు కలిపి షుమారు లక్షమంది మహిళలు రోజూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అయితే ప్రధాన స్రవంతి మీడియా కి ఇది అసలు వార్తగానే కనిపించడంలేదు. ఎవరైనా ఛోటామోటా నాయకులు ఎప్పుడైనా శిబిరానికి వస్తే లోకల్ టాబ్లయిడ్ లో సింగిల్ కాలం స్పెస్ ఫిల్లింగ్ వార్తలుగా తప్ప అసలు కవరేజ్ లకే నోచుకోవడం లేదు. మొన్న కాకినాడకి ఏదో ప్రోగ్రాం కి హాజరైన ప్రముఖ కథకులు మహమ్మద్ ఖదీర్ బాబు CAA శిబిరం లోని మహిళల్ని చూసి విస్మయం చెందుతూ "రామారావు పేట మహిళలు" అని ఎంతో హృద్యంగా పోస్ట్ పెట్టాడు. అది చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ధార్మిక భూమి అని వీళ్ళ ఉసురు తగిలి ప్రభుత్వం నాశనం అవుతుంది అంటూశాపనార్థాలు పెడుతూ రాసిన చాలా ఇడియాటిక్ పోస్ట్ అది. సాహిత్యంలో ముందుపీటీన వుండే ముస్లీం బుద్ధిజీవుల అవగాహనని, కార్యాచరణని ఈ విషయంలో పరిశీలించాలనిపించింది.
నిజంగానే ఆ నిరసన శిబిరాల్లో కాఫిర్ లే తప్ప ఖాదర్ లు, ఖదీర్ లు లేరు. ఒకప్పుడు అస్థిత్వవాద ఉద్యమం ముందుకు దూసుకు వచ్చినప్పుడు మైనారిటీ సాహిత్యంతో గుర్తింపు పొందిన స్టార్ రైటర్స్ ఎవరూ ఇప్పుడు ఈ నిరసన కారులతో లేరు. ఒక సెక్యూర్డ్ లైఫ్ లోకి వెళ్లిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ నిరసనల్లో ఎక్స్ ఫోజ్ కావడం ఎందుకు అని జాగ్రత్త పడుతున్నారేమో మరి. తొలితరం కవులు దేవిప్రియ, సుగంబాబుల్ని మైనారిటీ కవులుగా ఎవరూ గుర్తించలేదు. తెలుగులో "పుట్టుమచ్చ" కవితతో ప్రసిద్ధులైన ఖాదర్ మొహియుద్దీన్ ఏవో ఒకట్రెండు CAA వ్యతిరేక మీటింగ్ ల్లో మాట్లాడటం చూసాను కానీ మొత్తం జరుగుతున్న ఉద్యమానికి సాహితీరంగం నుంచి నాయకత్వం వహించే ఆసక్తి ఆయన లో కనిపించలేదు. కూర రాజన్న, గద్దర్, పరిటాల రవి లని భ్రష్టు పట్టించిన ఆయన్ని ఆయన వర్గీయులే నమ్మే పరిస్థితి లేదు. ఇక డానీ విషయానికి వస్తే ఆయనకి ఆయన తనది ఇంటర్నేషనల్ స్థాయి అనుకునే పరిస్థితి. పీపుల్స్ వార్ నాయకులకే పాఠాలు చెప్పాననే పాత డబ్బా వాయించు కోవడంతప్ప మరో సొంత కార్యక్రమం లేదు. ఆయన సాహితీవేత్తో, రాజకీయ నాయకుడో,పాత్రికేయుడో ఎవరికీ తెలియదు. ఆయన భార్య అజిత కి కూడా తెలియక పోవొచ్చు. మైనారిటీ అస్తిత్వ కవిత్వాన్ని తెలుగులో బలంగా ఎత్తిపట్టిన అఫ్సర్ ఎప్పుడూ ఉద్యమకారుడు కాదు. పైగా ఇప్పుడు పరదేశీ. కవిసంగమం యాకూబ్ కి మైనారిటీ అస్తిత్వ స్పృహే తక్కువ అని ఆయన కవిత్వం చదివిన ఎవరికైనా అర్ధమవుతుంది. విరసం యాభై ఏళ్ళ వార్షికోత్సవ సభలకు ఆయన్ని ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా పెడితే వేలాదిమంది ఉన్న కవిసంగమం నుంచి కనీసం వందలాది మందినైనా సభకు వచ్చేలా చేస్తారు అని విరసం వాళ్ళు బాగా ఆశ పడ్డట్టువున్నారు. కనీసం నలుగురైదుగురినైనా ఆ సభలకు రప్పించలేని పరిస్థితి ఆయనది. ఆయన్ని ఇక ఈ రాజ్య వ్యతిరేక ఉద్యమంలో ఆశించడం అత్యాశే. మొదటినుంచి మైనారిటీ అస్థిత్వవాద ఉద్యమానికి నాయకత్వ స్థానంలో ఉండేందుకు కృషి చేస్తూ వస్తోన్న స్కైబాబా ఈ CAA వ్యతిరేక ఉద్యమంలో యాక్టివ్ గా వున్నారు. పోస్టులు పెడుతున్నారు. తిరుగుతున్నారు. కానీ నిరసన కారులకీ తనకీ మధ్య ఉన్న వర్గ వైరుధ్యం ఆయన్ని ఆ శిబిరాల బయటే నిలబెట్టేస్తుంది. నాకు కింది స్థాయికి వెళ్ళి కార్యాచరణలో నిలబడి, కుటుంబం గడిచేందుకు ఒక్కపూట పనిచేసుకుంటూ చైతన్యవంతంగా , స్ఫూర్తి నిచ్చేలా పని చేస్తోన్న కవి ఒక్క నబీ కరీం ఖాన్ మాత్రమే కనిపిస్తున్నారు. ఆయన ప్రభావం తెలుగు సాహిత్యం మీద తక్కువ. అయితే ఆయన స్థాయికి మించి కృషి చేస్తున్నారు. కవి నిర్గుణ్, సాబీర్ లాంటి కవులు బలమైన గొంతులతో మాట్లాడుతున్నారు కానీ కార్యాచరణ కానీ, కదిలించగలిగే శక్తి గానీ వాళ్లకు లేదు.
ఇక రామారావు పేట మహిళలు గురించి రాసిన మహమ్మద్ ఖదీర్ బాబు విషయానికి వద్దాం. ప్రస్తుతం లాబీయిస్టులతో నిండిపోయిన తెలుగు సాహిత్యంలో ఆయనో పెద్ద లాబీయిస్టు. సీనియర్ పాత్రికేయుడు. ఆయన పూనుకుంటే ఈ ఉద్యమానికి చాలా చేయొచ్చు. ఆయన పోస్ట్ లోనే ఓ సీనియర్ సాహితీవేత్త అడిగారు. ఈ వార్తలు కనీసం మీరు పనిచేసే పేపర్లలో ఎందుకు రావడం లేదు అని. యాజమాన్య ఫాలసీ లాంటి వంకలు చెప్పొచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే ఖదీర్ చూసే సాక్షి ఫ్యామిలీ పేజీలో కథనాలుగా రాస్తే యాజమాన్యానికి అభ్యంతరం ఉండదు. కానీ ఖదీర్ గురించి తెలిసిన వాళ్ళకి ఖదీర్ లాభం లేకుండా ఏమీ చేయడని. ఫ్యామిలీ పేజీని సెంటీమీటర్ కింతని సొమ్ము చేసుకునే ఖదీర్ ఈ కాఫిర్ లని ఎందుకు కవర్ చేస్తాడు. తెలుగు కథ ని ఎన్నిరకాలుగా సొమ్ము చేసుకోవాలో అన్ని రకాలుగా సొమ్ము చేసుకొనే ఖదీర్ ని, పైగా ధర్మభూమి అని ఆధ్యాత్మిక ప్రవచనాలు పలుకుతున్న ఖదీర్ ని ఆ శిబిరాల్లో చూడాలనుకోవడమే పొరపాటు.
తెలుగు సాహిత్యం లో గ్రూప్స్ అంతో ఇంతో ఉండటం ఎప్పుడూ ఉంది. ఈ ఖదీర్ ప్రవేశం తో పరాకాష్ట కి చేరుకున్నాయి. అస్తిత్వ ఉద్యమాలు మొదలైనప్పుడు స్త్రీవాదులు ఎన్జీవో లని మొదలు పెట్టి గ్రూప్స్ గ్రూప్స్ గా విడిపోయారు. అప్పటికే వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ కథా సీరీస్ తీసుకొని వస్తున్నారు. విరసం వాళ్ళు ఈ సీరీస్ కి మొదట్లో వెన్నుదన్నుగా ఉండేవారు. తానా తెలుగు సాహిత్యంలో పట్టు సాధించుకోడానికి నవీన్ తో కలిసింది. అప్పుడు విరసం అరుణ తారలో వచ్చిన కథలు, తమ సభ్యుల కథలు అందులో ప్రచురణకి ఇవ్వనని ప్రకటించారు. ( అందుకు విరుద్ధంగా 2018 కథలో పద్మకుమారి గారి కథ రావటం మీద ఇంతకు ముందు వ్రాసాను. ) నవీన్ వామపక్ష భావాలని పూర్తిగా వదిలేసుకొని ఏ ముసుగులు లేని తెలుగు సాహిత్యంకి సంభవించిన పరిపూర్ణమైన ఏజెంట్ గా అవతారాన్ని ప్రకటించాడు. కేరళలో జరిగిన కేంద్ర సాహిత్య అకాడమీ మీటింగ్ లో కథా సెక్షన్ లో కథకుడిగా వాసిరెడ్డి నవీన్ కథకుడిగా పాల్గొన్నాడు. ఆ మేరకు మరో కథకునికి రావాల్సిన అవకాశాన్ని నవీన్ పొందాడు. సాహిత్య అకాడమీ అసలు ఆ అవకాశం అతనికి ఎలా ఇచ్చిందో తెలియదు. ఇలాంటి నవీన్ కి ప్రత్యామ్నాయంగా మరో లాబీయిస్టుగా ఎదిగేందుకు ఖదీర్ బాబు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే స్టొరీ మీట్ లు లాంటివి పెట్టి కొంతమంది కథకుల్ని ఆకర్షిస్తున్నప్పటికీ నవీన్ కున్న బలమైన కమ్మ లాబీయింగ్ లాంటివి ఖదీర్ కు లేకపోవడం మైనస్ అయింది.
తెలుగు కథా సాహిత్యంలో కెరీరిజం అనే అధ్యాయాలకి తెర తీసినవాళ్ళు నవీన్, ఖదీర్ లే. నవీన్ కన్నా ఖదీర్ ఈ విషయంలో నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. నవీన్ కు కొన్ని విషయాల్లో నిజాయితీ ఉంటుంది. ఖదీర్ కి అదికూడా కనీస స్థాయిలో కూడా లేదు. నామినికి శిష్యరికం చేసి దర్గామిట్ట కథలు వ్రాసిన రచయితకి ఆ గురువుకి తరువాత కాలంలో చెడిపోయింది. ఈ రచయిత ఎదిగిన పరిణామ క్రమాన్ని గమనిస్తే అతనెంత అవకాశవాదో అర్ధం అవుతుంది. రాజకీయరంగంలో ప్రయత్నం చేస్తే గొప్పగా రాణించి ఉండేవాడు మరి సాహిత్య రంగంలో ఎందుకు ఉండిపోయాడో తెలీదు. కొన్నాళ్ళు హక్కుల లాయర్ గారి ఇంట్లో ఉన్నాడు. అక్కడ ఉంటూ పదిమంది దృష్టిలో పడేట్టు చేసుకున్నాడు. మోహన్ బృందానికి దగ్గర అయ్యాడు. ఆ హక్కుల లాయర్ గారి ఇంటి నుంచి బయటకు పంపబడ్డాడు. ఇప్పటికీ అప్పుడప్పుడు ఎఫ్బిలో హక్కుల లాయర్ గారి ఇంట్లో ఉన్నప్పుడు అంటూ రాయటం చూసి అతనెంతో గొప్పవారు అనుకుని గౌరవం ఇస్తే మీరు పొరపాటు పడినట్టే .
కె.శ్రీనివాస్ ఇంట్లో కొన్నాళ్ళు వున్నాడు. అప్పుడే కె.శ్రీనివాస్ , ఖదీర్ కలిసి ప్రజాతంత్ర సాహిత్య పత్రిక తీసుకొచ్చారు. వీరిద్దరిని టార్గెట్ చేస్తూ బూతు కరపత్రం వచ్చింది అప్పుడే. ఆ బూతు కరపత్రo వచ్చే నాటికి కె. శ్రీనివాస్ ఎక్కడా ఏ పత్రికలో పనిచేయటం లేదు.ఆంధ్రజ్యోతి రివైవ్ అవ్వబోతోన్న సమయం అది. అప్పుడు ఖదీర్ ఆశించినది
కె. శ్రీనివాస్ నుంచి ఖదీర్ కి దొరకలేదు. దాంతో ఇద్దరికీ చెడింది.
ఖదీర్ ఆంధ్రజ్యోతి లో పనిచేయడం , దాంట్లోంచి బయటకు రావడం అదీ వేరే కథ. కథ కి సంబంధించిన లాబీయిస్టుగా ఎదిగేందుకు ఖదీర్ ఎన్నుకున్న గొప్ప మార్గం "రైటర్స్ మీట్". ఆ మీట్ ప్రారంభంలో ప్రముఖ కథకుడు , సంపాదకుడు ఆర్. యం .ఉమామహేశ్వరరావు ఒక భాగస్వామి. తెనాలి దగ్గర జరిగిన రైటర్స్ మీట్ తరువాత ఆర్ యం. ఉమామహేశ్వరరావు తప్పుకున్నారు. ఖదీర్ కెరీరిజం అర్ధమైవుంటుంది అప్పటికి. ఈ ఎఫ్బివచ్చాక ఆ మీట్ విశేషాలు అందరికి తెలుస్తున్నాయి.
పోనీ కథకుడిగా ఏమైనా నిజాయితీ ఉందా అంటే అదీ లేదు. స్వాతి లో సరసమైన కథలతో కెరీర్ ని మొదలుపెట్టిన ఖదీర్ ని దర్గామిట్ట కథలు రాయించి కథకుడిగా నిలబెట్టిన వాడు నామిని. ఆ తర్వాత కూడా హిందీ కథల్ని ర మక్కీ కి మక్కీ కాపీ కొట్టి కథలు రసాడని చాల మంది చెబుతారు. ఆ విషయాన్ని తన కథా సంకలనంలో ఎంతో గొప్పగా వేసుకున్నాడు ఖదీర్. ఆ సమయంలో అతనికి కొంతమంది రచయిత లు ఖదీర్ కాపీ కథని సమర్ధించలేదని వారిని దూరంగా పెట్టాడు.
ఆ తర్వాత నామినీ పుస్తకం మీద జరిగిన గొడవలో ఇతనికి వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం చేసిన ప్రజాస్వామిక రచయిత్రితో, బమ్మిడి మొదలగు రచయితలతో ఖదీర్ కి చెడింది.ఆ విషయంని ఖదీర్ తన ఎఫ్బి వాల్ మీద వ్రాసుకున్నారు కూడా. ఆ తర్వాత ఖదీర్ రాసిన బియాoడ్ మెట్రో కథలు పరమ చెత్తవి.ఆ చెత్తని చెత్తా అన్నందుకు మరికొందరిని రైటర్స్ మీట్ నుంచి తొలగించాడు ఖదీర్. రీటోల్డ్ స్టోరీస్ పేరిటచేసిన చెత్త ప్రయోగం కూడా విమర్శల పాలయింది .
ఇప్పుడు సురేష్ ఒక కన్వీనర్ గా తనొక కన్వీనర్ గా సినిమా ఛాన్స్ లే టార్గెట్ గా రైటర్స్ మీట్ ని నడిపే ఖదీర్ పరమ అధికార, కీర్తి దాహి. ఎఫ్బిలోలో రైటర్స్ మీట్ అని న్యూస్ పిక్చర్స్ తో పెడతాడు. ఆ మీట్ ఎక్కడ, ఎవరెవరొస్తున్నారో సస్పెన్స్ లో పెడతాడు. కథకుల్లో ఆసక్తి ని పెంచుతాడు. మేము రావొచ్చా, మమ్మల్ని పిలవండి అని రచయితలు అతన్ని అడుక్కుంటారు. ఓపెన్ ఇన్విటేషన్ కాకపోతే ఎఫ్బిలో లో అలా పెట్టటం అమానవీయం కదా. ఆ రచయితలకి ఆత్మాభిమానం లేదు అలా ఆడుక్కోవటానికి. ఆ యాంగ్జయిటీ ని నిస్సిగ్గుగా సొమ్ము చేసుకుంటాడు ఖదీర్.
ఒకప్పుడు సరసమైన కథలు వ్రాసే ఖదీర్ ఇప్పుడు మైనారిటీ కథలు రాస్తున్నాడని ఓ వ్యాసం లో విమర్శించిన విరసం మాజీ సభ్యులు ఎన్. వేణు గోపాల్ ఈ మీట్ లో పాల్గొడానికి ఎంత ఉవ్విల్లూరి పోతుంటాడంటే ,ఖదీర్ ని దేబిరించి మరీ ఆ మీట్ లో పాల్గొంటాడు.ఆ మేరకు ఖదీర్ వేణూ రాసిన రాతల నుంచి విజయం సాధించిన్నట్టే .వివి సర్ అరెస్ట్ అయినప్పుడు ఆ విషయాల మీద జరిగిన మీటింగ్ ల్లో కానీ , ప్రకటన సంతాకాల్లో కానీ ఈ ఖదీర్ ,సురేష్ ల నుంచి ఎన్. వేణ గోపాల్ ఒక్క సారి కూడా ఒక సంతకం సాధించలేకపోయారు.
ఇప్పుడు ఆ రైటర్స్ మీట్ లో దాదాపు అంతా కొత్తగా రాస్తోన్న రచయితలే పాల్గొంటారు. ఇద్దరు ముగ్గురు తప్పా అంతా నలబై లు దాటినవాళ్లే. సాహిత్యంలో వాళ్ల కాంట్రిబ్యూషన్ ఏమిటో ఎవరికీ తెలియదు కానీ వాళ్ళు మాత్రం "మా గురువు.,మా స్వామీ., మా దేవుడు" అంటూ ఖదీర్ కథలపై పోస్టింగ్స్ పెడుతుంటారు. తన కంటే బాగా రాసే రచయితల గురించి రాయొద్దని వాళ్లకి ముందే గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తాడని వినికిడి. కొత్తగా రాసే రచయితలు ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన సేవకులుగా తయ్యారు కావటం ఎందుకో ఆయా కథకులే ఆలోచించుకోవాలి.
ఈ రైటర్స్ మీట్ లో సురేష్ ప్రభావం, ప్రమేయం తక్కువే. తన తానా లాబీయింగ్ కి ఖదీర్ కి సురేష్ కి ఉన్న కమ్మ కులం అవసరం.సురేష్ కి వ్యక్తిగత కారణాల వల్ల నవీన్, శివారెడ్డి , డా.చంద్రశేఖరావు గారి పట్ల వ్యతిరేకత ఉంది.దాంతో నవీన్ గ్రూప్ కన్నా ఖదీర్ తోనే కొనసాగుతున్నాడు. సాక్షి లో ఆర్టిస్ట్ మోహన్ వల్ల జాబ్ పొందిన ఖదీర్ కథలు ప్రచురించడానికి డబ్బులు తీసుకుంటాడని ఒక కమ్మ రచయిత్రి బహిరంగంగానే చెప్పారు. ఈ రచయిత్రి కథ ఎలా ఉన్నా వాసిరెడ్డి నవీన్ కథా సీరీస్ లో వేస్తాడు. ఆమె అతని బంధువు.
ఇప్పడు ఇదంతా ఎందుకు రాసాను అంటే CAA మీద అంత పరమ రోత పోస్టుపెట్టిన ఖదీర్ తన రైటర్స్ మీట్ లో ఎప్పుడూ పూర్తిగా ముస్లిం, మైనారిటీ రచనలపై సదస్సు పెట్టలేదు.
కధా మీనార్ సంకలనo తీసుకుచ్చాను అని దాబాయిస్తాడు కానీ అదీ తన వ్యాపారమే.
CAA మీటింగ్ ల్లో పాల్గునడం కాదుకదా, ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 100 రచయితలు సంతకాలు చేసిన ప్రకటన మీద కనీసం ఖదీర్ సంతకం చేయలేదు. అంత భద్రజీవి. గత 20 ఏళ్ల కి పైగా అనేక మంది రచయితలతో వ్యక్తులతో తన స్వప్రయోజనాల కోసమే విబేధాలు, స్నేహాలు నడిపిన ఖదీర్ కి ప్రస్తుతం దేశం ఎదురుకొంటున్న CAA కనీసం ఆసక్తి గౌరవం బాధా ఏమి లేదు. ఆశ్చర్యంగా అవగాహన కూడా లేదు.
ఆ మధ్య సారంగా ఇంటర్వ్యూలో తను పుట్టి పెరిగిన, తనకి ఎంతో పేరు తెచ్చిన కావలిపై, తన రూట్స్ పై అతను అప్పట్లో మాట్లాడిన మాటలు, అభిప్రాయాలని పాఠకులు ఎలా అసహించుకున్నారో అందరికీ తెలుసు.తనకి పేరు తీసుకొచ్చిన కావలిని అతను సిటీ జీవితం అనుభవంతో తూలనాడాడు. అటువంటి వాడికి తన సహా మైనార్టీల మీద, వాళ్ళ ఉద్యమాల మీద గౌరవం వుంటుందనుకోవడం, వుండాలనుకోవడం అత్యాశే.
ఖాదర్ లు లేకపోయినా, ఖదీర్ లు లేకపోయినా నబీలు వున్నారు. రామారావు పేట లు ఉన్నాయి. అజాదీ బాగ్ లు ఉన్నాయి. ఇది ధర్మ భూమో, కర్మ భూమో పోరాడేవాళ్లే తేల్చుకుంటారు. అయితే ఏదోఒకరోజు ఈ కెరీరిస్టుల తలుపుల్ని కూడా రాజ్యం తట్టేరోజు ఒకటి తప్పకుండా వస్తుంది. అప్పుడు సైతం వీళ్ల కోసం రామారావు పేటలు, అజాదీ బాగ్ లు కచ్చితంగా ఇలాగే, ఇంత దృఢంగానే నిలబడే ఉంటాయి.
No comments:
Post a Comment