Saturday, June 28, 2025

The Definition of poetry and a novel

 The Definition of poetry and a novel

 

కవిత్వం, నవల నిర్వచనం

నది అంటే కవిత్వం కాదు. తలుపు అన్నా కవిత్వం కాదు. తలుపుల్ని భళ్ళున తెరుచుకుని ప్రవహిస్తున్నది నది అంటే కవిత్వం అవుతుంది. రెండు సంబంధం లేని పదాల్ని కలిపి ఒక కొత్త పద దృశ్యాన్ని  సృష్టించడమే కవిత్వం. కథలకు కూడ ఇలాంటి సూత్రమే వర్తిస్తుంది. పరస్పర విరుధ్ధమయిన వ్యక్తుల్ని ఒకచోట చేర్చితే గొప్ప నాటకీయత పుడుతుంది. 

కథలు కూడ రెండు రకాలు. ఒకడు తన ప్రాంతాన్ని వదిలి పర్యాటనకు పోవడం ఒక రకం కథ. ఒక గ్రామం లోనికి ఒక అపరిచితుడు రావడం ఇంకో రకం కథ. ఈ రెండు రకాల కథలు ‘బారిస్టర్ పార్వతీశం’ నవలలో వున్నాయి. పార్వతీశం వలస దేశంలోని ఒక కుగ్రామాన్ని వదిలి వలస పాలకుల దేశానికి వెళతాడు. బ్రిటీష్ వలస పాలకుల రాజధాని అయిన లండన్ కు వలస దేశమయిన ఇండియా నుండి ఒకడు వస్తాడు. 

The Definition of poetry and a novel

A river is not poetry in itself, nor is a door. But when a door is flung open and a river surges through, it becomes poetry. Poetry emerges from the fusion of two seemingly unrelated words to create a new, vivid image. The same principle applies to stories. When contrasting characters are brought together, profound drama unfolds.

Stories, too, fall into two types. One type follows a person leaving their homeland to embark on a journey. The other involves a stranger arriving in a village. Both types are present in the novel Barrister Parvateesam. Parvateesam leaves his remote village in a colonized land to travel to the country of the colonial rulers. From India, a colonized nation, he ventures to London, the capital of British colonial power.